తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు పనబాక నామినేషన్

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు. నేతలు, కార్యకర్తలతో కలిసి వీఆర్సీ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే సొంత ప్రయోజనాల కోసం ఏపీని కేంద్రానికి తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టులు చేయిస్తోందని విమర్శించారు. అప్పటికీ లొంగకపోతే వ్యాపారాలను దెబ్బతీయడం, ఎవరైనా టీడీపీకీ సానుభూతిపరులుగా ఉండి.. వ్యాపారాలు చేసుకుంటే వాటిని ధ్వంస చేయడంలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి సీఎం జగన్ పొగరు దించాలని, వైసీపీ మోసాల పాలనకు నిరసనగా.. 22 గొర్రెలకు తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెను ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు ఒక్కరూ మాట్లాడడంలేదని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Panabaka nomination for Tirupati Lok Sabha by-election
Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.