పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫొటోస్ తో సినిమాపై హైప్స్ పెంచేసింది చిత్రయూనిట్ . తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చ్ 29 న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కానుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.