అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన రైతులు.. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రికత్త…

తెలంగాణ అసెంబ్లీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగిత్యాల చెరుకు రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపిస్తానని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలవాలన్నారు. చక్కెర పరిశ్రమ ప్రారంభంపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ముట్టడిని యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గత నెలలో జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కెర కర్మాగారం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నిజామాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే.. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలన్నింటిని తప్పకుండా తెరిపిస్తామని నేతలు తెలిపారు. రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్న చక్కెర కర్మాగారాన్ని మూసివేసిన ఘనత తెరాసకే దక్కిందని మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. చక్కెర పరిశ్రమ మూత పడటం వల్ల వేలాది మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు.

Load More By admin
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *